: జయలలితపై పోటీ చేయనున్న సినీనటి ఖుష్బూ?
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తేల్చడంతో, ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, తమ అధినేత్రి కోసం ఆర్కే నగర్ ఎమ్మెల్యే వెట్రివేలు తన పదవికి రాజీనామా చేశారు. జూన్ 27న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో జయపై సినీ నటి, పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, డీఎంకే కూడా బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది.