: ఓయూ జేఏసీ నేత అదృశ్యం... 'రసమయి' బెదిరింపులే కారణమా?
ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ నేత దరువు అంజన్న మంగళవారం రాత్రి నుంచి కనిపించడం లేదు. అంజన్న అదృశ్యంపై ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంజన్నకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి అధినేత 'రసమయి' బాలకిషన్ నుంచి బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. అంతకుముందు అంజన్న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో బాలకిషన్ ను విమర్శిస్తూ ధూంధాం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే, 'నీ అంతు చూస్తా'నంటూ బెదిరింపులు, ఆపై ఆయన అదృశ్యం చోటుచేసుకున్నట్టు అర్థమవుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.