: ఐర్లాండ్ కనుక రెఫరెండమ్ కు 'సై' అంది...మేమైతే 'నో' అంటాం: టోనీ అబాట్


స్వలింగ వివాహాలపై రెఫరెండమ్ కు తాము పూర్తి వ్యతిరేకమని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ స్పష్టం చేశారు. తమ దేశంలో చట్టసవరణకు సంబంధించి ఎన్నో రెఫరెండంలు జరిగాయని తెలిపిన ఆయన, స్వలింగ వివాహాలపై రెఫరెండం నిర్వహించాలని ఎవరైనా సలహా ఇస్తారని తాను భావించడం లేదని అన్నారు. కాగా, ఐర్లాండ్ లో స్వలింగ వివాహాలపై జరిగిన రెఫరెండం 62 శాతం ఓట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశంలో స్వలింగ వివాహాలు చట్టబద్ధమయ్యాయి.

  • Loading...

More Telugu News