: ట్విట్టర్ లో ఒబామా... అరగంట వ్యవధిలో లక్షన్నర మంది ఫాలోయర్లు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోదీ బాట పట్టక తప్పలేదు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో భారత ప్రధానిదే హవా. తాజాగా మోదీకి చెక్ పెట్టేలా బరాక్ ఒబామా కూడా ట్విట్టర్ లో ఖాతా ఓపెన్ చేశారు. @ POTUS పేరిట తెరిచిన ఖాతా ద్వారా ఒబామా నిన్న ప్రపంచ నెటిజన్లను పలకరించారు. ‘‘హలో, ట్విట్టర్! నేను బరాక్ ను. నిజంగా! ఆరేళ్లు గడిచిన తర్వాతనే చివరకు నాకంటూ ఒక ట్విట్టర్ అకౌంట్ ఇచ్చారు’’ అని ఆయన తన మొదటి ట్వీట్ ను వెరైటీగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదిలా ఉంటే, ఒబామా ఖాతా ఓపెన్ అయిన అరగంట వ్యవధిలోనే దాదాపు లక్షన్నర మంది ఫాలోయర్లు ఆ ఖాతాలో చేరిపోయారు. మరి, రానున్న రోజుల్లో మోదీని ఒబామా మించిపోతారేమో చూడాలి.

More Telugu News