: రాజకుమారుడు రోడ్లపైకా?... విడ్డూరంగా ఉంది!: టీఆర్ఎస్ ఎంపీ కవిత

ఇటీవలి రాహుల్ గాంధీ తెలంగాణా పర్యటనపై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో స్పందించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దాదాపు 45 సంవత్సరాలు పరిపాలన సాగించిన కాంగ్రెస్ పార్టీయే రైతుల ఆత్మహత్యలకు కారణమని వ్యాఖ్యానించిన ఆమె, వారి కోసం రాజకుమారుడు రోడ్లపైకి రావడం విడ్డూరంగా ఉందని అన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభానికి, ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ కారణమని ఆరోపించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి తమ నేత కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో చేరాలని ప్రధాని మోదీ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని ఆమె అన్నారు. జగిత్యాల పరిధిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారణమని ఆరోపించారు.

More Telugu News