: ఆ షరతు తప్పు: తమ్మారెడ్డి భరద్వాజ

సినీ పరిశ్రమలోని లుకలుకలను మరోసారి తెరపైకి తెచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ. చిత్ర పరిశ్రమలోని కొందరు వ్యక్తులు సొంత సంస్థలు పెట్టుకుని, సినీ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రెండు చానళ్లకే వాణిజ్య ప్రకటనలు ఇవ్వాలని షరతు పెట్టడం దారుణమని అభిప్రాయపడ్డారు. అలా షరతు విధించడం తప్పు అని స్పష్టం చేశారు. ఏ చానల్ కు ప్రకటన ఇవ్వాలన్నది నిర్మాత ఇష్టమని, నిర్మాతల మండలి ధరను మాత్రమే నిర్ణయించాలని, అంతకుమించి జోక్యం చేసుకోరాదని పేర్కొన్నారు. నిర్మాతల మండలిని కొందరు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందరినీ కలుపుకుని పోవాలని, అలా కాకుండా, తమ తొత్తులుగా ఉన్నవారికే ప్రయోజనం చేకూరేలా వ్యవహరించడం సరికాదని తమ్మారెడ్డి హితవు పలికారు.

More Telugu News