Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జయ కేసుపై సుప్రీంకు వెళ్లండి: కర్ణాటక ప్రభుత్వాన్ని కోరిన తమిళ రాజకీయ పార్టీలు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటించడాన్ని తమిళనాడు రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో జయ కేసులో కర్ణాటక హైకోర్టు ప్రకటించిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తమిళ పార్టీలు కోరాయి. డీఎంకే అధినేత కరుణానిధి సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి ఈ మేరకు విన్నవించాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు, హైకోర్టు తీర్పుల్లో చాలా వ్యత్యాసముందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇళంగోవన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం అప్పీలు చేయాలని కోరారు. అయితే జయ కేసులో హైకోర్టు తీర్పును తాను ఊహించలేకపోయానని డీఎండీకే చీఫ్ విజయకాంత్ అన్నారు.

More Telugu News