: నీలం రంగు సూర్యాస్తమయాన్ని ఫోటోలు తీసిన క్యూరియాసిటీ రోవర్
సూర్యాస్తమయం నీలంగా ఉండడమేంటి, విడ్డూరం కాకపోతే అనుకుంటున్నారా? నిజం... అంగారకుడిపై సూర్యాస్తమయం నీలంగానే ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ ఫోటోలు తీసి నిరూపించింది. భూమిమీద సూర్యాస్తమయం అంటే పసుపు, ఎరుపు రంగుల మేళవింపులో గోధూళితో అద్భుతంగా కనిపిస్తుంది. అయితే అంగారకుడిపై మాత్రం నీలంగా కనిపించింది. క్యూరియాసిటీ రోవర్ దాని మాస్ట్ కెమేరాను ఉపయోగించి గత వారం కొన్ని చిత్రాలను భూమికి పంపించింది. వీటిని పరిశీలించిన నాసా, తన వెబ్ సైట్లో పొందుపరిచింది. దీనిపై పరిశోధన చేయనున్నట్టు టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లెమన్ ప్రకటించారు.