: ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ మద్దతు... ప్రభుత్వమే సమ్మెను జటిలం చేస్తోందన్న రఘువీరా

రోడ్డు రవాణ సంస్థ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏపీ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు టీడీపీ సర్కారు కుట్ర చేస్తోందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విశాఖలో విమర్శించారు. ట్రాన్స్ పోర్టు సంస్థలు నడుపుతున్న టీడీపీ నేతలకు ఆర్టీసీని కట్టబెట్టాలన్న ఆలోచనతోనే ప్రభుత్వమే కార్మికుల సమ్మెను జటిలం చేస్తోందని ఆరోపించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు రఘువీరా ఆరోపించారు. ఇక ప్రత్యేక హోదా కోసం యత్నించాల్సిన ఎంపీలు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అందుకే హోదా కోసం ఈ నెల 14 నుంచి తాము విస్తృత పోరాటాలు చేస్తున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వాధినేతగా కాకుండా ప్రతిపక్ష నేతలా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ లో స్మగ్లర్లున్నారని చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 24 గంటల్లో తమ పార్టీలోని స్మగ్లర్ల పేర్లు ప్రకటించాలని లేదా క్షమాపణలైనా చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు.

More Telugu News