: పార్టీ మారడం లేదు... అవన్నీ ఊహాజనిత వార్తలే: మీడియాపై బొత్స సత్తిబాబు ఫైర్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ మీడియాపై ఫైరయ్యారు. ఊహాజనిత ప్రచారాన్ని ఆధారం చేసుకుని తనపై కథనాలు అల్లుతున్నారని ఆయన కొద్దిసేపటి క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీలో చేరుతున్నారని ఇటీవల ప్రచారం ఊపందుకుంది. గతంలో బీజేపీలో చేరేందుకు ఆయన చేసిన యత్నాలు విఫలమయ్యాయని, తాజాగా వైసీపీలో చేరేందుకు బొత్స తీవ్రంగా యత్నిస్తున్నారని కొన్ని వార్తా ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. వీటిపై స్పందించిన బొత్స, తాను కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ను వీడి ఏ పార్టీలోనూ చేరడం లేదని ఆయన ప్రకటించారు. ఊహాజనిత ప్రచారాన్ని ఆసరా చేసుకుని తనపై కథనాలను ప్రసారం చేయొద్దని ఆయన వార్తా ఛానెళ్లను కోరారు.

More Telugu News