గోదావరి తీరంలో బయల్పడ్డ గ్యాస్ నిక్షేపాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోదావరి తీరంలో బయల్పడ్డ గ్యాస్ నిక్షేపాలు

తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం మండలం ఠానే లంక సమీపంలో గోదావరి తీరాన కొండకుదురులంక ద్వీపంలో గ్యాస్ నిక్షేపాలు విరివిగా ఉన్నట్టు ఆయిల్ ఇండియా సంస్థ గుర్తించింది. వీటిని వెలికి తీసేందుకు నాబార్స్ అనే అంతర్జాతీయ డ్రిల్లింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. కాగా, కృష్ణా, గోదావరి బేసిన్ లో ఓఎన్జీసీ, రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ, గెయిల్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ లు ఆన్ షోర్, ఆఫ్ షోర్ కార్యకలాపాల ద్వారా చమురు, సహజవాయువులను వెలికి తీస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News