: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోలు పై 80 పైసలు తగ్గగా, లీటర్ డీజిల్ పై 1.30 పైసలు తగ్గింది. అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా, పెట్రోలు, డీజిల్ ధరలను పెట్రోలియం కంపెనీలు సమీక్షించాయి. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గినట్టు పెట్రోలియం కంపెనీలు ప్రకటించాయి. కాగా, కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన అనంతరం, ఇంధన ధరలు కిందికి దిగడం ఇది ఆరవసారి కావడం విశేషం. తగ్గిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.