: మ్యాక్స్ వెల్, యువీ... ఎవరు సత్తా చాటుతారు?

ఐపీఎల్ సీజన్-8లో భాగంగా నేడు ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పగల యువీ, మ్యాక్స్ వెల్ పైనే అందరి చూపూ కేంద్రీకృతమైంది. కాగా, టోర్నీలో రెండు జట్లు చెరి రెండు మ్యాచ్ లు ఆడినప్పటికీ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో పరాజయం చవిచూసిన పంజాబ్ జట్టు, రెండో మ్యాచ్ లో పుంజుకుని ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. అద్భుతమైన పోరాట స్పూర్తితో విజయతీరాలకు చేరుతుందనేలా ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రెండు మ్యాచ్ లలోనూ ఓటమి భారంతో నిరాశలో కూరుకుపోయింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి, సత్తా చాటుతారా? లేక రాజస్థాన్ ధాటికి చేతులెత్తేస్తారా? అనేది మరికాసేపట్లో తేలిపోనుంది.

More Telugu News