: బాబుపై ప్రశ్నల వర్షం కురిపించిన చైనా సంస్థ

పెట్టుబడుల సేకరణ నిమిత్తం చైనా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సంతృప్తికరంగా సాగుతోంది. సినోమా సంస్థతో ఏపీ సీఎం చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా సినోమా సంస్థ బాబును ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. భారత్ లో పన్నుల విధానం ఎలా ఉంటుంది? మీ పారిశ్రామిక విధానం ఏమిటి? ఎన్ని రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తారు? సిమెంటు సంప్రదాయేతర ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాం, అందుకు మీరిచ్చే సహాయ సహకారాలు ఏంటి? పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ఏమిటి? అంటూ సినోమా సంస్థ ఛైర్మన్ బాబును ఉక్కిరిబిక్కిరి చేశారు.

More Telugu News