: ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేయాలి: శివసేన ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సామ్నా పత్రికలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సామ్నా పత్రికలోని కథనం ప్రకారం ఒవైసీ బ్రదర్స్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముస్లింలను రెచ్చగొట్టి ఒవైసీ సోదరులు లబ్ధి పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. కేవలం ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలోనే పోటీ చేస్తూ, ఎంఐఎం పార్టీ లబ్ధి పొందుతోందని ఆయన విమర్శించారు. అందుకే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడకుండా ఉండేలా ముస్లింల ఓటుహక్కును తొలగించాలని ఆయన చెప్పారు. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది.

More Telugu News