: కొత్త రకం ఉల్లి... కోసేటప్పుడు కన్నీళ్లు రావట!


ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు వాటి ఘాటుకు కళ్లల్లో నీళ్లు రావడం తెలిసిందే. ముక్కులు కారతాయి కూడా. పడతులు, వంటవాళ్ల బాధ జపాన్ శాస్త్రవేత్తలను తాకినట్టుంది! కోస్తే కన్నీళ్లు రాని కొత్త రకం ఉల్లిపాయలను అభివృద్ధి చేశారు. హౌస్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్ దీనిపై పరిశోధనలు చేపట్టింది. ఉల్లిపాయల్లో కన్నీళ్లు వచ్చేందుకు కారణమయ్యే రసాయనాన్ని గుర్తించి, దాన్ని నియంత్రించి, కొత్త రకం ఉల్లిని ఆవిష్కరించారు. అయితే, ఇవి ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేట్టు కనిపించడంలేదు. వీటికి వాణిజ్యపరమైన అనుమతులు లభించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News