: ఏప్రిల్ 4న హైదరాబాదులో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదులో ఏప్రిల్ 4న నీటి కొరత ఏర్పడనుంది. కృష్ణా ఫేజ్-3 నీటిని ఏప్రిల్ 4 నుంచి హైదరాబాదుకు పంప్ చేయనున్నారు. ఈ కారణంగా హైదరాబాదు నగరంలో ఏప్రిల్ 4న నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.
దీనిపై హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ ఎండీ జగదీశ్వర్ మాట్లాడుతూ, నీటి వినియోగదారులు పొదుపు చర్యలు పాటించి, ఆ రోజు సహకరించాలని కోరారు. బస్తీలు, ఇతర ప్రాంతాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా తరలించి సరఫరా చేయనున్నామని ఆయన పేర్కొన్నారు.