: యువతను ఆకట్టుకుంటున్న బంగారం, వెండి టాటూలు
రంగురంగుల టాటూలకు ఇక కాలం చెల్లిందని భావించాలేమో? ఎందుకంటే బంగారం, వెండితో టాటూలు రంగప్రవేశం చేశాయి. ఈ టాటూలకు యువత నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. బంగారం, వెండి టాటూల కారణంగా నగలు ధరించాల్సిన అవసరం లేకపోవడం కూడా యువతను ఆకట్టుకుంటోంది. ఈ టాటూలపై మోజు తీరిపోగానే తొలగించుకునే వెసులుబాటు కూడా ఉంది. బంగారం, వెండి టాటూలు వేసేందుకు కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ప్రత్యేకంగా ఓ పార్లర్ కూడా ఉంది. నగలు ధరించినట్టుగా ఉండే ఈ టాటూలు వేయించుకునేందుకు యువత ఉత్సాహం చూపుతోందట.