: మున్సిపల్ అధికారుల 'చెత్త' పని అతని ప్రాణం తీసింది!


చిత్తూరు జిల్లా మున్సిపల్ అధికారుల నిర్వాకం ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైంది. ఎంతకీ ఆస్తిపన్ను చెల్లించడం లేదని అతని ఇంటిముందు మున్సిపల్ అధికారులు చెత్త లారీ నిలిపారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని మదనపల్లికి చెందిన నారాయణ అనే స్థానికుడు కోళ్లఫారం నిర్వహిస్తున్నాడు. కొన్నిరోజుల కిందట అతనికి ఆస్తిపన్ను నోటీసు పంపారు. గతంలోనూ రెండుసార్లు నోటీసు పంపినప్పటికీ అతను చెల్లించలేదు. ఎలాగైనా పన్ను కట్టించాలన్న అత్యుత్సాహంతో అధికారులు నారాయణ ఇంటి ముందు చెత్తలారీ ఉంచారు. దీనిని అవమానంగా భావించడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News