: పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి

తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి ఈ ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు వేసిన పరువునష్టం దావా కేసులో నోటీసులు అందుకున్న ఆయన కోర్టు ఆదేశాల మేరకు నేడు హాజరయ్యారు. హైటెక్‌ సిటీ వద్ద భూముల కేటాయింపునకు సంబంధించి అవకతవకలు జరిగాయని, ఈ కేటాయింపుల్లో మై హోం సంస్థ భారీగా లబ్ది పొందిందని రేవంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తప్పులు ఎత్తి చూపిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, భూమి వ్యవహారంలో ఏం జరిగిందో న్యాయస్థానం ముందు పెడతానని రేవంత్ రెడ్డి అంటున్నారు. కాగా, కేసును విచారించిన న్యాయస్థానం ఏప్రిల్ 28కి కేసును వాయిదా వేసింది.

More Telugu News