చంచల్ గూడ, చర్లపల్లి ఖైదీలు కూడా నేటి వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంచల్ గూడ, చర్లపల్లి ఖైదీలు కూడా నేటి వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నారు!

టీమిండియా క్రికెట్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్క అభిమాని టీవీలకు అతుక్కుపోతారు. అందునా ప్రస్తుతం ప్రపంచకప్ జరుగుతుండటం, ముఖ్యంగా ఈరోజు భారత్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగుతుండడంతో క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలోని ఖైదీలకు కూడా ఈ మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. మ్యాచ్ ను రెండు జైళ్లలోని ఖైదీలకు చూపిస్తున్నట్టు జైళ్ల డీజీ వీకే సింగ్ తెలిపారు. ఇందుకోసం చర్లపల్లిలో 100 టీవీలను, చంచల్ గూడలో 50 టీవీలను ప్రదర్శన కోసం ఏర్పాటు చేశామన్నారు. చట్టప్రకారం దూరదర్శన్ లో ప్రసారమయ్యే మ్యాచ్ ను ఖైదీలు చూస్తారని సింగ్ చెప్పారు.

More Telugu News