: దగ్గు చికిత్స కోసం బెంగళూరు పయనమైన కేజ్రీవాల్... పది రోజులు బెంగళూరులోనే!


దగ్గు వైద్యం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేటి ఉదయం బెంగళూరు బయలుదేరి వెళ్లారు. పది రోజుల పాటు బెంగళూరులోనే ఉండనున్న కేజ్రీవాల్, దగ్గుకు పూర్తి స్థాయి వైద్యం తీసుకున్న మీదటే ఢిల్లీకి తిరిగి వెళతారట. ఈ మేరకు కేజ్రీవాల్, పది రోజుల పాటు బెంగళూరులో ఉండనున్నట్లు ఢిల్లీ సీఎంఓ ప్రకటించింది. కేజ్రీవాల్ అందుబాటులో లేని సమయంలో ఢిల్లీ పాలనను డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పర్యవేక్షించనున్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ప్రధానిని ఆహ్వానించేందుకు వెళ్లిన కేజ్రీవాల్ కు నరేంద్ర మోదీ ఓ కీలక సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. దగ్గు తగ్గేందుకు బెంగళూరులోని నేచురోపతి వైద్యుడి వద్ద చికిత్స తీసుకోవాలని మోదీ , కేజ్రీవాల్ కు సూచించారు. అంతేకాక అక్కడికక్కడే సదరు నేచురోపతి వైద్యుడికి ఫోన్ చేసి మరీ కేజ్రీవాల్ కు మంచి చికిత్స అందించాలని కోరారు. ఈ క్రమంలోనే నేడు కేజ్రీవాల్ బెంగళూరు బయలుదేరారు.

  • Loading...

More Telugu News