: అడిగినా వివరాలివ్వకపోతే ఏం చేస్తాం: పవన్ కల్యాణ్ పర్యటనకు భద్రతపై పోలీసులు


జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) స్పందించింది. పవన్ వస్తున్నారని తెలిసినా భద్రత ఎందుకు కల్పించలేదని సీఎంఓ అధికారులు పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెనువెంటనే స్పందించిన పోలీసు బాసులు, పవన్ కల్యాణ్ పర్యటన గురించిన సమాచారం ఉందని, అయితే పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయడంలో జనసేన విఫలమైందని చెప్పారు. అంతేకాక తమంత తాముగా వివరాలు వెల్లడించాల్సిన జనసేన, పోలీసులు అడిగినా పవన్ కల్యాణ్ పర్యటన గురించిన పూర్తి వివరాలు వెల్లడించలేదట. ఈ కారణంగానే తాము పవన్ కల్యాణ్ పర్యటనకు భద్రత కల్పించలేకపోయామని గుంటూరు జిల్లా పోలీసు బాసులతో పాటు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా సీఎంఓకు వివరణ ఇచ్చారట. ప్రస్తుతం వీటన్నింటినీ పక్కనబెట్టి తక్షణమే పవన్ కల్యాణ్ పర్యటనకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని సీఎంఓ పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News