త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న స్కాట్లాండ్ క్రికెటర్
ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో భాగంగా నెల్సన్ లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో స్కాట్లాండ్ బ్యాట్స్ మన్ బేరింగ్టన్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో మాథ్యూ క్రాస్ కొట్టిన షాట్ నాన్ స్ట్రయికర్ ఎండ్ లో వున్న బేరింగ్టన్ మణికట్టుకు బలంగా తగిలింది. దీంతో, బేరింగ్టన్ బ్యాట్ ను వదిలేశాడు. వైద్యుల తక్షణ చికిత్సతో బ్యాటింగ్ కొనసాగించినప్పటికీ, తరువాతి బంతికే అవుటయ్యాడు.