: ముగిసిన బడ్జెట్ ప్రసంగం... లోక్ సభ సోమవారానికి వాయిదా
లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 బడ్జెట్ ప్రసంగం ముగిసింది. బడ్జెట్ లో పొందుపర్చిన అంశాలను సభకు వివరించారు. ఈ ఉదయం 11 గంటలకు మొదలైన మంత్రి ప్రసంగం 12.40 గంటల వరకు కొనసాగింది. ఆ వెంటనే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.