: నైపుణ్యం ఉంటే మానసిక నిపుణుల అవసరం లేదు: సౌతాఫ్రికా కోచ్

వరల్డ్ కప్ లీగ్ దశలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకునే దక్షిణాఫ్రికా జట్టు సెమీస్ కొచ్చేసరికి చతికిలపడుతుంది. గత మూడు వరల్డ్ కప్ లలో టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా పేరొందిన సౌతాఫ్రికా జట్టు, ఒత్తిడికి గురై రిక్త హస్తాలతో వెనుదిరిగింది. దీంతో ఆదివారం జరగనున్న టీమిండియా పోరులో ఫేవరేట్ గా ఉన్న సఫారీ జట్టు మానసిక నిపుణులను సంప్రదిస్తే బాగుంటుందని పలువురు సలహా ఇస్తున్నారు. దీనిపై ఆ జట్టు కోచ్ రస్సెల్ డొమింగో స్పందించారు. తమకు మానసిక నిపుణులను కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఏడాది కాలానికి పైగా సఫారీల కోచ్ గా పనిచేస్తూ టీంను గమనిస్తున్నానని, గడచిన 8 నుంచి 9 నెలల కాలంలో తాము సైకాలజిస్ట్ సహకారం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశాడు. వరల్డ్ కప్ కీలక టోర్నీ అయినప్పటికీ తమ జట్టుకు వారి అవసరం లేదని ఆయన తెలిపాడు. ఆటగాళ్ల నైపుణ్యంపైనే తాను ఆధారపడతానని చెప్పిన ఆయన, మానసిక వైద్యుల సలహాలు అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

More Telugu News