: ఐఎస్ఐఎస్ అంతులేని దారుణాలు... బందీల అవయవాలతో వ్యాపారం: ఐరాస విచారణలో వెల్లడి

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దారుణాలు మరింతగా పెచ్చుమీరాయి. తాజాగా తమ వద్ద బందీలుగా ఉన్న వారి అవయవాలను దోచుకుంటూ, వ్యాపారం చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి తన విచారణలో వెల్లడించింది. బందీలుగా పట్టుబడ్డ పౌరుల నుంచి మూత్రపిండాలు, గుండె, రక్తం, కాలేయం తదితరాలను బలవంతంగా తీసుకొని ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నాయని ఇరాక్ లో ఐరాస ప్రతినిధి మొహమ్మద్ అల్ హకీమ్ వెల్లడించినట్టు సీఎన్ఎన్ తెలిపింది. చాలా మంది బందీల నుంచి పలు అవయవాలు దొంగిలించినట్టు తెలుస్తోందని ఆయన వెల్లడించారు. మానవ విలువలను ఉగ్ర సంస్థలు పూర్తిగా విస్మరించాయని అల్ హకీమ్ ఆరోపించారు. తాము ఊహిస్తున్న దానికంటే ఎక్కువగానే ఈ దురాగతాలు జరిగి ఉండవచ్చని ఆయన అన్నారు. కాగా, గడచిన జనవరిలో మొత్తం 790 మంది ఇరాక్ లో హతమయ్యారని తెలుస్తోంది.

More Telugu News