: గెలుపు బాటలో భారత్... ఒకే ఓవర్లో డేంజరస్ అఫ్రిది, రియాజ్ అవుట్
అడిలైడ్ లో భారత్ తో మ్యాచ్ లో ప్రమాదకర ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అవుటయ్యాడు. 22 బంతుల్లో చకచకా 22 పరుగులు చేసిన అఫ్రిదిని షమీ పెవిలియన్ చేర్చాడు. షమీ విసిరిన ఫుల్ టాస్ బంతిని భారీ షాట్ ఆడబోయిన అఫ్రిది వికెట్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. షమీ అదే ఓవర్లో వాహబ్ రియాజ్ (4) ను కూడా అవుట్ చేయడంతో పాక్ 154 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. భారత్ విజయానికి మరో 3 వికెట్ల దూరంలో ఉంది.