30 దేశాల్లోని వంద బ్యాంకులపై సైబర్ దాడి... రూ.1862 కోట్ల దోపిడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

30 దేశాల్లోని వంద బ్యాంకులపై సైబర్ దాడి... రూ.1862 కోట్ల దోపిడీ

ప్రపంచంలోని 30 దేశాల్లో గల 100 బ్యాంకులపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దుండగులు సైబర్ దాడికి దిగారు. అంతేకాదు, మొత్తం రూ.1862 కోట్లను దోచుకున్నారు కూడా. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కీ ల్యాబ్ ఈ విషయాన్ని గుర్తించి చెప్పింది. అనుమానాస్పద సాఫ్ట్వేర్ ద్వారా హ్యాకర్లు సుదీర్ఘ కాలం పాటు బ్యాంకింగ్ వ్యవస్థల్లోకి చొరబడ్డారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రష్యన్లు, చైనీయులు, యూరోపియన్లతో కూడిన గ్యాంగు ఈ మొత్తాన్ని దోచుకుందట. ఈ సొమ్మును చిన్న చిన్న మొత్తాలుగా మార్చేసి, ప్రపంచంలోని అనేక బ్యాంకులకు పంపారని, వీటిలో ఎక్కువ మొత్తం జపాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికాలోని బ్యాంకులకు వెళ్లినట్టు సమాచారం. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కావల్సిన సమయాల్లో కావల్సిన ఏటీఎం మిషన్ల నుంచి డబ్బులు వాటంతట అవే బయటకు వచ్చేలా చేసి, ఆ సొమ్మును నొక్కేశారట!

More Telugu News