: చిత్తూరు జిల్లాలో విద్యుత్ షాక్ తో గజరాజు మృతి

అడవులు కుంచించుకుపోతూ, పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటున్న నేపథ్యంలో జనావాసాల్లోకి వస్తున్న అడవి జంతువులు మృత్యువాత పడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకర్గ పరిధిలోని రామకుప్పం, గుడుపల్లె మండలాల్లో నిత్యం జనావాసాల సమీపంలోకి వస్తున్న గజరాజులు పంటలను నాశనం చేయడంతో పాటు పలువురిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేటి ఉదయం జనావాసాల వద్దకు వచ్చిన ఓ గజరాజు మృత్యువాత పడింది. కుప్పం పరిధిలోని రామకుప్పం మండలం పీకేఎం తండాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో విద్యుత్ షాక్ నకు గురైన గజరాజు మృతి చెందింది.

More Telugu News