: ఢిల్లీ ఎన్నికల్లో గెలుపొందే వీఐపీలు వీరే!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖ వ్యక్తుల గెలుపోటములపై ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. వారు విడుదల చేసిన నివేదిక ప్రకారం: చాందినీ చౌక్ లో అలక్ లాంబా (ఆప్) గెలుపు అనుమానమేనని తెలిపింది.
పత్పండ్ గంజ్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ పడుతున్న వినోద్ బిన్నీ పరాజయం ఖాయమని వెల్లడించింది.
అరవింద్ కేజ్రీవాల్ గెలుపు నల్లేరు మీద నడకని పేర్కొంది.
జనక్ పురి నుంచి బీజేపీ అభ్యర్థి జగదీష్ ముఖి అనుమానమేనని పేర్కొంది.
బల్లియమాన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హయాన్ యూసుఫ్ ఓటమి ఖాయమని చెప్పాయి.
కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ పరువు దక్కించుకోనున్నారు.
పటేల్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కృష్ణతీరథ్ ఓటమి తప్పదని పేర్కొంది.
ద్వారకా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి మహాబల్ మిశ్రా పరాజయం పాలవుతారని వెల్లడించింది.
సదర్ బజార్ నుంచి కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిగా ఉన్న అజయ్ మాకెన్ ఓడిపోతారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
పీలంపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మతిన్ అహ్మద్ ఓడిపోతారని వెల్లడించింది.
జంగ్ పురా బీజేపీ అభ్యర్ధి ఎంఎస్ ధీర్ పరాజయం పాలవుతారని చెప్పింది.
తిమాపూర్ నుంచి పోటీ చేసిన బీజేపీ నేత రజనీ అబ్బీ కంగుతింటారని తెలిపింది.
మంగోల్ నుంచి ఆప్ తరపున పోటీ పడుతున్న రాఖిబిండ్ల, గ్రేటర్ కైలాశ్ నుంచి ఆప్ అభ్యర్ధి సౌరభ్ భరద్వాజ్ విజయం సాధిస్తారని తెలిపింది.