: ఇంత దారుణాన్ని ఆ వైద్యుడు జీవిత కాలంలో చూళ్లేదట...!
హర్యానాలోని రోహ్ తక్ లో దారుణం చోటుచేసుకుంది. పోస్టు మార్టం చేసిన వైద్యుడే తన జీవితంలో ఇంత దారుణమైన సంఘటనను చూళ్లేదంటే ఆ ఘోరం ఏ రీతిన జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. రోహ్ తక్ లో మతిస్థిమితం లేని ఓ మహిళను ఆమె సోదరి చికిత్స నిమిత్తం నేపాల్ నుంచి తీసుకువచ్చి తన ఇంట్లో ఉంచుకుంది. అలాంటి మహిళను దుండగులు ఆమె తలమీద కొట్టి సగం అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అత్యాచారానికి పాల్పడ్డారని, అనంతరం క్రూరాతిక్రూరంగా ఆమె దేహంతో ఆడుకున్నారని పోస్టుమార్టం నివేదికలో ఆ వైద్యుడు పేర్కొన్నారు.
బాధితురాలి దేహమంతా ఛిద్రం కాగా, కొన్ని భాగాలు జంతువులు తినేసినట్టు భావిస్తున్న ఈ ఆమానుష సంఘటనలో పోస్ట్ మార్టం చేసిన వైద్యుడు మృతదేహం పరిస్థితి చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇంతటి దారుణమైన స్థితిలో మృతదేహాన్ని తన కెరీర్ లో చూడలేదని పేర్కొన్నాడు. కాగా, సామూహిక అత్యాచారం, హత్య కేసులో పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు.