: ఫ్యాక్షన్ వీడితేనే కర్నూలు అభివృద్ధి: ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప
కర్నూలు జిల్లా అభివృద్ధి చెందాలంటే జిల్లా వాసులు ఫ్యాక్షన్ నేపథ్యాన్ని వదలివేయాలని ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మరో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో కలిసి ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కర్నూలు నగరంలో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లావాసులు ఫ్యాక్షన్ కు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా కూడా తగ్గుముఖం పట్టిందని ఆయన పేర్కొన్నారు.