: నన్నిలా తీర్చిదిద్దింది ఐపీఎల్: ఆసీస్ కెప్టెన్ స్మిత్
ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఆటతో పాటు అవార్డులతోనూ దూసుకుపోతున్నాడు. తాజాగా సిరీస్ లో అత్యధిక పరుగులు చేసి న్యూ బ్రాడ్ మెన్ ఆఫ్ క్రికెట్ ఆస్ట్రేలియాగా కితాబులందుకుంటున్నాడు. సాధారణ ఆటగాడిగా ఉన్న తనను అసాధారణ ఆటగాడిగా మార్చింది ఐపీఎల్ అని పేర్కొన్నాడు. ఈ రోజు తానిలా ఉన్నానంటే దానికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని తెలిపాడు.
ఐపీఎల్ లో నేర్చుకున్న అంశాలే తన ఆటతీరును మెరుగుపరచాయని స్మిత్ అన్నాడు. ఐపీఎల్ వంటి గొప్ప టోర్నమెంట్ లో భాగస్వామ్యం పొందినందుకు సంతోషిస్తున్నానని స్మిత్ పేర్కొన్నాడు. వన్డేల్లో రాణించడానికి ఐపీఎల్ ఎంతో దోహద పడిందని చెప్పిన స్మిత్, తన సెక్సెస్ క్రెడిట్ అంతా ఐపీఎల్ దేనని స్పష్టం చేశాడు.