: మన రక్తంలోనే లౌకికవాదం ఉంది: వెంకయ్యనాయుడు

భారతీయుల రక్తంలోనే లౌకికవాదం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. భారత దేశం హిందూ దేశం అని, లౌకిక అనే పదాన్ని భారత రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించి, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని శివసేన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భారత రాజ్యాంగ పీఠిక నుంచి లౌకిక వాదం అనే పదాన్ని తొలగించే ఆలోచన లేదని ఆయన తెలిపారు. లౌకిక వాదానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.

More Telugu News