: లీటరు పెట్రోలుకు 96 కి.మీ... ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే బైకు ఇదే!
ఇటీవలి కాలంలో హోండా, హీరో మోటో కంపెనీలతో పోటీపడలేక మార్కెట్ వాటా కోల్పోయిన బజాజ్ ఆటో తాజాగా ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే బైకును విడుదల చేసింది. లీటరు పెట్రోలుతో 96.9 కి.మీ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) నడిచేలా తయారు చేసిన ప్లాటినా ఈఎస్ (ఎలక్ట్రిక్ స్టార్ట్)ను ఆవిష్కరించింది. ఇది 'ప్రపంచంలోనే మైలేజ్ ఛాంపియన్' అని సంస్థ అభివర్ణించింది. ఈ బైకు ధర రూ.44,507 (ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) అని వివరించింది. 102 సీసీ సింగిల్ సిలిండర్ డీటీఎస్ఐ టెక్నాలజీ ఇంజిన్, 8 బీహెచ్ పీ, 8.7 ఎన్ఎం పవర్ తో బైకు నడుస్తుందని తెలిపింది. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని దీన్ని తయారు చేశామని, ఆకర్షణీయ ఫైనాన్సు ఆఫర్లు అందిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో వున్న ప్లాటినాతో పోలిస్తే కొత్త మోడల్ బైకులో లేటెస్ట్ గ్రాఫిక్స్, మారిన హెడ్ లాంప్, కొత్త సైడ్ ప్యానల్స్ అదనపు ఆకర్షణలు.