: నర్సు యూనిఫాంలో వచ్చి శిశువును ఎత్తుకెళ్లిన మాయలాడి
తిరుపతి వెంకటేశ్వర ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో శిశువు మాయమైన ఘటన కలకలం రేపింది. చంద్రగిరి మండలం మొరవపల్లికి చెందిన మునిరాజు, సోనియా దంపతులకు ఆడ శిశువు జన్మించింది. అయితే, నర్సు యూనిఫాంలో వచ్చిన ఓ మహిళ శిశువును ఎత్తుకెళ్లిందని శిశువు సంబంధీకులు అంటున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, టీకాలు వేయిస్తానని చెప్పి ఆ మాయలాడి శిశువును ఎత్తుకెళ్లినట్టు తెలిసింది.