: తాజా వరల్డ్ కప్ ఫార్మాట్ నచ్చలేదంటున్న ద్రావిడ్

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్ కప్ ఫార్మాట్ నచ్చలేదంటున్నాడు భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్. ఈ ఫార్మాట్ ప్రకారం, తదుపరి దశకు చేరుకునే ఎనిమిది జట్లు ఏవో ముందే ఊహించి చెప్పేయవచ్చన్నాడు. తద్వారా ఆటలో మజా ఉండదని అభిప్రాయపడ్డాడు. 1999, 2003 వరల్డ్ కప్ టోర్నీల్లో అనుసరించిన ఫార్మాట్లు అత్యుత్తమమైనవని ద్రావిడ్ పేర్కొన్నాడు. తొలుత గ్రూప్ స్టేజ్, ఆ తర్వాత సూపర్ సిక్స్ దశ, ఆపై సెమీస్, ఫైనల్ తో ఆ రెండు టోర్నీలు ఆసక్తి కలిగించాయని వివరించాడు.

More Telugu News