: ఇక సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు... గూగుల్ సరికొత్త ప్రయోగం విజయవంతం!
గూగుల్ రూపొందిస్తున్న కార్లు రోడ్లపైకి వస్తే... స్టీరింగ్ వదిలేసి ఎంచక్కా విలాసంగా కారులో కూర్చుని ప్రయాణించవచ్చు. అమెరికాలోని కాలిఫొర్నియాలో స్టీరింగ్, పెడల్స్ తీసేసిన కారును రోడ్లపై పరుగులు పెట్టించిన గూగుల్ సదరు ప్రయోగంలో సత్ఫలితాలను సాధించింది. ఎదురుగా వస్తున్న కార్లు, రోడ్ల మ్యాపులకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని నిక్షిప్తం చేసిన సెన్సార్లను కారులో అమర్చి గూగుల్ ఈ ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఈ తరహా కార్లను ఉత్పత్తి చేసేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది. మరో ఐదేళ్లలో ఈ కార్లు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.