Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శనమిచ్చిన మకరజ్యోతి

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమలలో అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు నుంచి జ్యోతి దర్శనం లభించింది. జ్యోతి దర్శనంతో భక్తులంతా పులకించిపోయారు. స్వామియే శరణం అయ్యప్పా అన్న శరణు ఘోషతో శబరిమల మారుమోగింది. జ్యోతి దర్శనం కోసం వేచి ఉన్న లక్షలాది మంది భక్తులు... జ్యోతి దర్శనమైన వెంటనే రెండు చేతులూ పైకెత్తి నమస్కరిస్తూ, అయ్యప్ప స్మరణలో మునిగిపోయారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. కోట్లాది మంది ప్రజలు టీవీల ద్వారా జ్యోతి దర్శనం చేసుకున్నారు.

More Telugu News