: పది లక్షల డాలర్లు ఇస్తా... శాస్త్రవేత్తలకు సవాల్
అమెరికాకు చెందిన ఝూన్ యున్ అనే ఫండ్ మేనేజర్ శాస్త్రవేత్తలకు సవాలు విసిరాడు. మనిషి జీవిత కాలాన్ని 120 ఏళ్లకు పెంచే శాస్త్రవేత్తలకు 10 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తానని ఆయన స్పష్టం చేశాడు. మనిషి జీవిత కాలం గరిష్ఠంగా 120 ఏళ్లనే సిద్ధాంతం ఉందని, గరిష్ఠ జీవిత పరిమాణం కోసం ఔషధం కనుగొనాలన్నదే తన షరతని ఝూన్ యున్ తెలిపారు. జీవిత ప్రమాణం పెంచే ఔషధం కనుగొనే పనిలో 15 శాస్త్రవేత్తల బృందాలు పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. కాగా, ప్రస్తుతం మనషి జీవన ప్రమాణం కేవలం 56 ఏళ్లకు పడిపోయిందని పలు పరిశోధనలు పేర్కొన్న సంగతి తెలిసిందే.