: వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి ఎగబాకిన కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి ఎగబాకాడు. తాజాగా ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకుల్లో 862 పాయింట్లతో కోహ్లీ ద్వితీయస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సఫారీ వన్డే కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. డివిల్లీర్స్ ఖాతాలో 887 పాయింట్లున్నాయి. ఈ టాప్-10 జాబితాలో శిఖర్ (5) ధావన్, ఎంఎస్ ధోనీ (10) కూడా ఉన్నారు. బౌలింగ్ ర్యాంకుల విషయానికొస్తే... భువనేశ్వర్ కుమార్ (8), రవీంద్ర జడేజా (9) టాప్-10లో నిలిచారు. ఈ జాబితాలో విండీస్ విలక్షణ స్పిన్నర్ సునీల్ నరైన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐసీీసీ సస్పెన్షన్ వేటుకు గురైన పాక్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ రెండో స్థానంలో నిలిచాడు. సఫారీ స్పీడ్ స్టర్ డేల్ స్టెయిన్ మూడో ర్యాంకు దక్కింది.