: రుణమాఫీ హామీ వల్లే చంద్రబాబుకు అధికారం: వైఎస్ జగన్
రైతులకు రుణమాఫీ అనే అబద్ధంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకున్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తమ పార్టీ కూడా రుణమాఫీ చేస్తామని ప్రజలకు అబద్ధం చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చేదన్నారు. అలాంటి మోసం చంద్రబాబు చేయడంవల్లే అధికారం దక్కించుకున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు. కర్నూలులో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ఈ రోజు ఆళ్లగడ్డ, నంద్యాల వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలనుద్దేశించి జగన్ మాట్లాడారు. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత పార్టీపై ఉందని జగన్ చెప్పారు.