: రిమోట్ ద్వారా గర్భధారణ నియంత్రణ!
ఓ చిన్న చిప్ ను మహిళ శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా 16 సంవత్సరాల పాటు రిమోట్ ద్వారా గర్భధారణను నియంత్రించే సాంకేతికతను ఎంఐటీ ప్రాజెక్ట్ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. వీరికి కావాల్సిన నిధులను బిల్ గేట్స్ ఆధ్వర్యంలోని గేట్స్ ఫౌండేషన్ అందిస్తుండటం గమనార్హం. శరీరానికి ఏ మాత్రం హానికరం కాని రీతిలో ఈ చిప్‌ను స్త్రీ శరీరంలోకి పంపిస్తారు. శరీరంలో కొద్దిపాటి మొత్తాల్లో గర్భ నిరోధక హార్మోన్ లు విడుదలయ్యేలా ఈ చిప్ చూస్తుంది. అవసరమనుకుంటే దీన్ని బయటి నుంచి రిమోట్ సాయంతో ఆఫ్ చేయవచ్చు. ఫిమేల్ కంప్యూ-కాంట్రాసెప్టివ్ చిప్ పేరిట తయారవుతున్న ఈ చిప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని సమాచారం.