తెలుగు భక్తుల కోసం శబరిమలలో ఐదెకరాల స్థలమివ్వండి: కేరళ సీఎంకు వీహెచ్ విజ్ఞప్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు భక్తుల కోసం శబరిమలలో ఐదెకరాల స్థలమివ్వండి: కేరళ సీఎంకు వీహెచ్ విజ్ఞప్తి

రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు కొద్దిసేపటి క్రితం కేరళ సీఎం ఊమెన్ చాందీని కలిశారు. శబరిమలలో తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా ఉమెన్ చాందీని వీహెచ్ కోరారు. ఈ విషయంలో అవసరమైతే ప్రభుత్వం నుంచి లేఖ కూడా అందజేస్తామని వీహెచ్ తెలిపారు. శబరిమలకు వస్తున్న తెలుగు భక్తులకు సదరు స్థలంలో వసతి సౌకర్యాలు కల్పిస్తామని వీహెచ్ చెప్పారు. తన ప్రతిపాదనకు ఊమెన్ చాందీ సానుకూలంగా స్పందించారని వీహెచ్ చెప్పారు.

More Telugu News