Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో తగ్గిన రద్దీ... రెండు గంటల్లో దర్శనం

గత నాలుగు రోజులుగా కిటకిటలాడిన తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. నేటి మధ్యాహ్నానికి 8 కంపార్ట్ మెంట్లలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, నడకదారి భక్తులకు నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, మంగళవారం శ్రీవారిని దర్శించే భక్తుల కోసం 4 వేల ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచినట్టు టీటీడీ వెల్లడించింది. నేటి మధ్యాహ్నం 2:45 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు రేపు ఒంటి గంట నుంచి 4 గంటల మధ్య సుమారు 3,500 టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

More Telugu News