డ్రెస్సింగ్ రూంలో ఆల్ ఈజ్ వెల్: కెప్టెన్ ధోనీ
టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ల మధ్య నెలకొన్న ఘర్షణపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. డ్రెస్సింగ్ రూంలో ఎలాంటి గొడవలు లేవని, అంతా ప్రశాంతంగా ఉందని అతడు పేర్కొన్నాడు. ఆల్ ఈజ్ వెల్ అంటూ ప్రకటించిన ధోనీ... కోహ్లీ, ధావన్ ల మధ్య గొడవ జరిగిందన్న వార్తలను కొట్టిపారేశాడు. జట్టు సభ్యులంతా ఫ్రెండ్లీగా ఉంటున్నారని చెప్పాడు. క్రికెటర్లకు విశ్రాంతి లేదనడాన్ని కూడా ధోనీ కొట్టిపారేశాడు. బ్రిస్బేన్ టెస్టు సందర్భంగా జరిగిందని ప్రచారంలోకి వచ్చిన కోహ్లీ, ధావన్ ల ఫైట్ పై జట్టు మేనేజ్ మెంట్ కూడా స్పందించలేదు.