విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పేదే క్రిస్ మస్: ఏపీ సీఎం చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పేదే క్రిస్ మస్: ఏపీ సీఎం చంద్రబాబు

విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పేదే క్రిస్ మస్ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. క్రిస్ మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. క్రీస్తు బోధనలు శాంతి, అహింస, క్షమాగుణం, ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలని తెలిపారు. సాటి వారి పట్ల ప్రేమ, దయతో మెలగడమే క్రీస్తు సందేశమని, క్రీస్తు చూపిన దారిలో నడిచి ప్రపంచశాంతికి తోడ్పడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మైనారిటీ సామాజిక వర్గాలకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని, రాష్ట్రంలో క్రైస్తవులకు భద్రత కల్పించడంతో పాటు వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

More Telugu News