: దిష్టిబొమ్మలందు...రోబో దిష్టి బొమ్మలు వేరయా!

ప్రతి ఏటా వ్యవసాయదారులకు పక్షులతో విశేషమైన నష్టం చేకూరుతుంటుంది. పక్షుల నుంచి పంటను రక్షించుకునేందుకు వ్యవసాయదారులు పంట చేలల్లో దిష్టి బొమ్మలు, టేపు రికార్డర్ టేపులు, పాలిధీన్ సంచులను వేలాడదీస్తూ ఉంటారు. అయినా పక్షులు వాటిని పట్టించుకోకుండా పంటను నాశనం చేస్తాయనుకోండి. వలస పక్షులు ఉన్న చోట్ల ఈ నష్టం తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వాటన్నింటికీ చెక్ పెట్టేలా హోలాండ్ లో రోబో దిష్టిబొమ్మకు ప్రాణం పోశారు అక్కడి వ్యవసాయ శాస్త్రవేత్తలు. దీని పేరు అగ్రిలేజర్. ఈ యంత్రాన్ని కంప్యూటర్ కు అనుసంధానించి లేజర్ కిరణాలు వెదజల్లే విధంగా తయారు చేశారు. ఇది లేజర్ కిరణాలను వెదజల్లడంతో వాటి ధాటికి పక్షులు పారిపోతాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. 3 వేల ఎకరాలకు ఒక రోబో సరిపోతుందని వారు చెబుతున్నారు. దీని ఏర్పాటు కూడా చాలా సులువని వారు స్పష్టం చేస్తున్నారు.

More Telugu News