Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్యాంట్ ధరించకుండానే ఆ యువతి న్యూయార్క్ లో తిరిగేసింది!

వినూత్న స్టైల్ లో యువతరం ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. తమ ప్రయోగాన్ని యూట్యూబ్ లో పెట్టి ఫలితాలు చూసుకుని యువతరం సంబరపడిపోతోంది. తాజాగా ఓ యువతి అలాంటి వినూత్న ప్రయోగాన్ని చేపట్టి తొలి రోజే 10 లక్షల హిట్లు కొట్టింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో లియా జంగ్ అనే మోడల్ ప్యాంటేసుకోకుండా తిరిగేసింది. పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన బాడీ ఆర్ట్ తో జీన్ ప్యాంటు రూపంలో శరీరానికి రంగులు పూసుకున్న లియా సాధారణ యువతిలా తిరిగింది. ఆమె బాడీ పెయింట్ అచ్చం జీన్ ప్యాంటును పోలి ఉండడంతో ఎవరికీ అనుమానం రాకపోవడం విశేషం. దీంతో ఆమె నేరుగా ఓ బట్టల షాప్ లోకి వెళ్లి, తాను వేసుకున్న లాంటి మోడల్ 'జీన్' కావాలని అడగడంతో తేరిపార చూసిన షాప్ కీపర్ కింది ఫ్లోర్ లో ఉంది మేడమ్ అనడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. నెట్ లో అప్ లోడ్ చేసిన తొలి రోజే దీనిని 10 లక్షల మంది చూడడం విశేషం.

More Telugu News